: ఇక 'ముజ్రా పార్టీ'... ఖానామెట్ లో అశ్లీల పార్టీపై పోలీసుల దాడి, 24 మంది అరెస్ట్


మొన్నటిదాకా హైదరాబాదు శివారులోని రిసార్టుల్లో రేవ్ పార్టీలు హోరెత్తాయి. పోలీసుల ముప్పేట దాడులతో ఈ తరహా పార్టీలు ప్రస్తుతం దాదాపుగా తగ్గిపోయాయనే చెప్పాలి. అయితే జల్సాలకు అలవాటు పడ్డ హైదరాబాదు యువతకు అశ్లీల పార్టీలు లేనిదే టైంపాస్ కావడం లేదట. ఈ క్రమంలో రేవ్ పార్టీల ప్లేస్ లో ముజ్రా పార్టీలు వచ్చేశాయి. నిన్న రాత్రి మాదాపూర్ పరిధిలోని ఖానామెట్ లో కొంతమంది యువకులు ముజ్రా పార్టీలో లీనమయ్యారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆ పార్టీపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు యువతులు సహా 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు కార్లతో పాటు రూ.21 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో జీహెచ్ఎంసీ అధికారులు సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News