: నేను నిక్షేపంలా ఉన్నాను...జైల్లో పెట్టినా దీక్ష ఆగదు: ముద్రగడ
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కిర్లంపూడిలోని స్వగృహంలో ఆయన మాట్లాడుతూ, తమ దంపతులకు ఉపవాసాలు ఉండడం అలవాటేనని అన్నారు. కార్తీక మాసంలో తన భార్య కేవలం టీ నీళ్లతోనే కాలం గడుపుతుందని, వారంలో మూడు రోజులు పూజలు, పునస్కారాల రూపంలో గడుపుతుందని ఆయన తెలిపారు. తమకు ఇది అలవాటేనని చెప్పిన ఆయన, కేవలం తమ ఆరోగ్యం బాలేదన్న ప్రచారం కోసమే ప్రభుత్వం వైద్యులను పంపిందని అన్నారు. తమను జైలుకు పంపినా లేదా సముద్రంలో విసిరేసినా దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయినా తాము ప్రభుత్వం చెప్పినవే కదా అడిగాం అని ఆయన ప్రశ్నించారు.