: ఏడు కొండలు దిగి, శ్రీనివాసుడు భాగ్యనగరం విచ్చేశాడు: కేసీఆర్
తిరుమల గిరులు దిగిన శ్రీనివాసుడు భాగ్యనగరం విచ్చేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. హైదరాబాదులో టీటీడీ, నవభారత్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన వెంకటేశ్వర వైభవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాసుని వైభవాన్ని వీక్షించే అవకాశం భాగ్యనగరి ప్రజలకు కల్పించిన హర్షకు ధన్యవాదాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు భవిష్యత్ మార్గాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజులపాటు శ్రీనివాసుని వైభవం తిలకించడంతో హైదరాబాదీల జన్మ ధన్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. భగవంతుడు కొలువై ఉన్న ఏ ప్రాంతమైనా గొప్ప ప్రదేశమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవకు ధన్యవాదాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుతో కేసీఆర్ ముచ్చటించారు.