: దరిద్రం కక్షగట్టడమంటే ఇదేనేమో...ఒక్క నిర్ణయంతో వేల కోట్లు పోయాయి!


సాధారణంగా ఎవరినైనా అదృష్టం పట్టుకుందని అంటుంటారు. కానీ అమెరికాకు చెందిన క్రిస్ హిల్ స్కాట్ (29) పై మాత్రం దరిద్రం కక్షగట్టి మరీ పట్టుకుందని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే...స్విఫ్ట్ కీ అనే సాఫ్ట్ వేర్ యాప్ ను క్రిస్ తన మిత్రులు జాన్ రొనాల్డ్ (30), బెన్ మెక్ లాక్ (36) తో కలిసి రూపొందించాడు. అయితే, ఫోటోగ్రఫీ పట్ల మక్కువ గలిగిన క్రిస్, 24/7 ఉద్యోగం పట్ల విరక్తి చెంది...యాప్ ను తయారు చేసిన ఆరు నెలలకే వ్యవస్థాపక డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతూ, తన షేర్ ను స్నేహితులిద్దరికీ అమ్మేశాడు. ఆ సందర్భంగా వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ కోసం వివిధ ప్రాంతాలు తిరిగేందుకు ఓ సైకిల్ ను కొనుక్కున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఈయన బయటకు వచ్చేసిన అనంతరం యాప్ మరింత ప్రాచుర్యం పొందింది. 47 దేశాల్లో వంద భాషల్లో ఈ యాప్ ను వినియోగదారులు వినియోగిస్తున్నారు. దీంతో ఈ యాప్ ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి జాన్, బెన్ అమ్మేశారు. తద్వారా ఒక్కొక్కరికి 2,500 కోట్ల రూపాయలు షేర్ గా లభించాయి. దీంతో, తన నిర్ణయంతో ఎంత నష్టపోయాడో క్రిస్ కు అర్థం అయింది. కాగా, క్రిస్ ఇప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్ల డిజైనర్ గా పని చేస్తున్నారు.

  • Loading...

More Telugu News