: విశాఖ తీరంలో అలరిస్తున్న ఫ్లీట్ రివ్యూ... నౌకల ప్రదర్శనను వీక్షిస్తున్న రాష్ట్రపతి


విశాఖ తూర్పు తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష అలరిస్తోంది. సాగర తీరమంతా దేశ,విదేశీ నౌకల ప్రదర్శనలతో అందంగా మారిపోయింది. నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి, దేశ రక్షణ మంత్రులు ఐఎన్ఎస్ సుమిత్ర నౌక నుంచి నౌకల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధుల కోసం ఐఎన్ఎస్ సునయన కేటాయించగా అందులో ప్రయాణిస్తూ నౌకల ప్రదర్శనను వీక్షిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు 90 భారత నేవీ నౌకలు పాల్గొన్నాయి. ప్రదర్శన సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అంతర్జాతీయ నౌకాదళ గౌరవ వందనం స్వీకరించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. సముద్రం మధ్యలో ఈ పరేడ్ నిర్వహించడం ప్రపంచంతో స్నేహహస్తానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నౌకలు మన తీరానికి రావడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. సముద్ర తీర రక్షణలో నౌకాదళ సమీక్ష కొత్త ముందడుగని ప్రణబ్ తెలిపారు. సముద్రతలంపై శాంతి, ప్రశాంతి నెలకొల్పడంలో నౌకాదళాలది కీలక భూమిక అని చెప్పారు.

  • Loading...

More Telugu News