: సజీవ దహనం చేస్తామంటూ బెదిరిస్తున్నారు: 'ఆప్' నేత ఫిర్యాదు


తనను సజీవ దహనం చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోనీ సోరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మావోయిస్టుగా పేర్కొంటూ, బీజాపూర్ లో కాలు పెడితే సజీవ దహనం చేస్తామని బెదిరిస్తున్నారని దంతెవాడ జిల్లాలోని గీదమ్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మావోయిస్టు ప్రాబల్యం గల బీజాపూర్, సుక్మా జిల్లాల్లో కూంబింగ్ పేరుతో భద్రతా దళాలు గిరిజన మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో బస్తర్ ప్రాంతంలో సమస్యలను వెలికి తేవడంలో ముందుండే సోనీ సోరీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. భద్రతా సిబ్బంది అయినా, మావోయిస్టులైనా గిరిజనులపై దురాగతాలకు పాల్పడితే ప్రజానేతగా వాటిని వెలుగులోకి తేవడం తన విధి అని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News