: కాసేపట్లో గ్రేటర్ ఓట్ల లెక్కింపు ప్రారంభం


మరికొద్ది సేపట్లో గ్రేటర్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం 33.41 లక్షల మంది ఓట్లు వేశారు. హైదరాబాద్, సైబరాబాద్ లో 24 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 5,626 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో రౌండ్ లెక్కింపునకు సుమారు 15 నిమిషాల సమయం పడుతుంది. మూడు రౌండ్లు మాత్రమే ఉన్న దత్తాత్రేయనగర్, అక్బర్ బాగ్, రెయిన్ బజార్ ఎన్నికల ఫలితాలు ముందుగా రావచ్చని తెలుస్తోంది. నాలుగు రౌండ్లలోనే ఫలితాలు వచ్చే డివిజన్లు 41 వరకు ఉన్నాయి. 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉన్న సరూర్ నగర్, ఆర్.కె.పురం, చంపాపేట, సనత్ నగర్ డివిజన్లలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News