: సల్మాన్, షారుక్ లపై పిటిషన్... మార్చ్ నుంచి విచారణ
బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లపై దాఖలైన పిటిషన్ మార్చిలో విచారణకు రానుంది. మీరట్ లోని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మార్చి 8న ఈ పిటిషన్లపై విచారణ చేపడతారు. కలర్స్ చానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో షూటింగులో ఓ దేవాలయం సెట్ లోకి వారిద్దరూ పాదరక్షలతో వెళ్లారు. ఆ సంఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ కేసు నమోదైంది. ఈ క్రమంలో హిందూ మహాసభల మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు భరత్ రాజ్ పుత్ ఇవాళ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు.