: విశాఖ సర్క్యూట్ హౌస్ లో చంద్రబాబు సమీక్ష... ముద్రగడ దీక్ష, తదనంతర పరిణామాలపైనే చర్చ


కాపులకు రిజర్వేషన్లే ప్రధాన డిమాండ్ గా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షపై ఎట్టకేలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కోసం నిన్న సాయంత్రమే విశాఖ చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అందుబాటులో ఉన్న మంత్రులతో విశాఖ సర్క్యూట్ హౌస్ లో సమీక్షించారు. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా ముద్రగడ దీక్ష, ఆయన డిమాండ్లను నెరవేర్చే అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు వ్యవహరించాల్సిన వ్యూహంపై కూడా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News