: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు బెయిల్ మంజూరు


కోడలు, మనవళ్ల మృతి కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ కుమార్ కు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అనిల్ రెండో భార్య సనాకు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, గత ఏడాది నవంబర్ లో రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో ఆయన కోడలు, మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News