: నిందితుడితో బాధితురాలి కాళ్లు పట్టించారు!


ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి శిక్షగా ఆమె కాళ్లుపట్టించి వదిలివేశారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలోని ఒక గ్రామపంచాయతీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 28న ముప్ఫై సంవత్సరాల వితంతువుపై లైంగిక దాడి జరిగింది. దీంతో, పోలీసులను ఆశ్రయించేందుకు వెళుతున్న ఆమెను గ్రామ పెద్ద ఒకరు ఆపారు. ఈ కేసును తానే పరిష్కరిస్తానని, పోలీస్ స్టేషన్ కు వెళ్లవద్దని చెప్పాడు. పోలీస్ స్టేషన్ బయటే పంచాయతీ నిర్వహించాడు. నిందితుడితో బాధితురాలి కాళ్లను పట్టించిన అనంతరం అతన్ని వదిలివేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలివేయాలని.. పట్టించుకోవద్దని బాధితురాలికి చెప్పాడు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News