: ఆన్ లైన్ ఓటింగ్ తోనైనా ఓటింగ్ శాతం పెరగవచ్చు: కేటీఆర్
తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆన్ లైన్ ఓటింగ్ ను ప్రస్తావించారు. హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్సులో జరిగిన జాతీయ పీఎస్సీ (పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఛైర్మన్ల సదస్సు వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఆన్ లైన్ ఓటింగ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతిని అమలు చేయడం ద్వారానైనా ఓటింగ్ శాతం పెరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.