: నేవీ ఫ్లీట్ రివ్యూకు వేళాయే!... నేటి నుంచి విశాఖలో ఐఎఫ్ఆర్
అంతర్జాతీయ నావికా దళ సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్వూ) నేటి నుంచి ఏపీలోని సాగర నగరం విశాఖలో ప్రారంభం కానుంది. మొత్తం 24 దేశాలకు చెందిన దాదాపు 90 భారీ నౌకలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. ఇప్పటికే రోజుల తరబడి విశాఖలో జరిగిన ఫ్లీట్ రివ్యూ రిహార్సల్ విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేటి నుంచి అసలు విన్యాసాలు అబ్బురపరచనున్నాయి. భారత్ లో జరుగుతున్న రెండో ఫ్లీట్ రివ్యూకు ఇండియన్ నేవీ భారీ ఏర్పాట్లు చేసింది. 5 రోజుల పాటు జరగనున్న ఈ విన్యాసాలను వీక్షించేందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రేపు సాయంత్రానికే విశాఖకు రానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఏపీ పోలీసు విభాగం, కోస్ట్ గార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ప్రధాని ఈ నెల 8 దాకా విశాఖలోనే ఉంటారు.