: చిరంజీవికి నన్ను ప్రశ్నించే అర్హత ఉందా?: చంద్రబాబు
కాంగ్రెస్ నేత చిరంజీవికి తనను ప్రశ్నించే నైతిక అర్హత ఉందా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాపులకు మేలు చేసేందుకు పార్టీ పెడుతున్నానని ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు బీసీలు, కాపుల కోసం పనిచేస్తామని చిరంజీవి చెప్పారని ఆయన తెలిపారు. అలాంటి చిరంజీవి కాపుల కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. అసలు చిరంజీవికి స్వార్థప్రయోజనాలు మినహా కాపుల సంక్షేమం ఏనాడైనా పట్టిందా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి చిరంజీవి, కాపుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న తనను ప్రశ్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.