: ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఉత్తర్వుల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ ప్రాంతాన్ని మార్చింది. దానికి సంబంధించిన ఉత్తర్వుల్లో ఇవాళ సవరణలు చేసింది. గతంలో మంగళగిరిలోని అమరావతి టౌన్ షిప్ లో భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మల్కాపురం, వెలగపూడి భూముల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.