: ఎమ్మెల్యే జేసీ నిరసన... ఇద్దరు గన్ మెన్లను వెనక్కి పంపిన వైనం!
తన అనుచరులకు పెయిడ్ గన్ మెన్ లను కేటాయించడంపై అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ, తన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గన్ మెన్ లను ఐదురోజుల క్రితమే ఆయన వెనక్కి పంపించి వేశారు. ఇన్ని రోజులైనప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో గన్ మెన్ లు లేకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, ఈ విషయమై జేసీకి, పోలీసు ఉన్నతాధికారులకు మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం.