: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.25 శాతం పోలింగ్ నమోదు: ఎన్నికల సంఘం
ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45.25 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2009 గ్రేటర్ ఎన్నికల్లో 42.92 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. ఈ క్రమంలో ఈసారి కాస్త పోలింగ్ శాతం మెరుగుపడిందని అధికారులు తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ లో అత్యధికంగా 59.19 శాతం, అత్యల్పంగా మోహదీపట్నంలో 34.28 శాతం, విజయ్ నగర్ కాలనీలో 34.51 శాతం పోలింగ్ నమోదైనట్టు వివరించారు. అత్యధికంగా ఎర్రగడ్డ- 59.19 శాతం, రామచంద్రాపురం- 58.30, చర్లపల్లి- 57, రామాంతపూర్ 56.62, గోల్నాక -55.03, పూరానాపూల్ -54.04 డివిజన్లలో పొలింగ్ నమోదైనట్టు తెలిపారు.