: నాకు కొడుకు పుట్టాడు, ఆశీర్వదించండి: ప్రకాశ్ రాజ్
దక్షిణాది భాషల్లో క్యారెక్టర్ నటుడిగా ఎనలేని పేరుతెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ మరోసారి తండ్రయ్యాడు. నిన్న సాయంత్రం తమకు కొడుకు పుట్టాడని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తెలిపాడు. "హాయ్! నేను, నా భార్య పోనీ వర్మ, మా జీవితంలో జరిగిన ఓ సంతోషకర సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాం. మాకో కొడుకు పుట్టాడు. ఆశీర్వదించండి" అని ట్వీట్ చేశాడు. 2010లో తన మొదటి భార్య లలిత కుమారి నుంచి విడిపోయిన ప్రకాశ్, ఆపై ప్రముఖ కొరియో గ్రాఫర్ పోనీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.