: నీటి అలలపై మధ్యప్రదేశ్ కేబినెట్ భేటీ... ‘టూరిజం కేబినెట్’కు చౌహాన్ శ్రీకారం


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ఓ సాహస కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. నీటి అలలపై తేలియాడే భారీ క్రూయిజ్ పై ఆయన తన కేబినెట్ తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మినిస్టర్లంతా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త జవజీవాలు నింపేందుకు చౌహాన్ ఈ వినూత్న భేటీని నిర్వహించారట. నర్మద నదిపై నిర్మించిన నిజాం సాగర్ డ్యాం బ్యాక్ వాటర్ లో ‘నర్మద క్వీన్’ అనే ప్రత్యేక క్రూయీజ్ లో జరిగిన ఈ భేటీలో చౌహాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేకంగా ‘కృషి కేబినెట్’ ఉంది. తాజాగా నిన్నటి భేటీలో ‘టూరిజం కేబినెట్’ ఏర్పాటుకు చౌహాన్ కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ‘టూరిజం కేబినెట్’ పనిచేయనుంది.

  • Loading...

More Telugu News