: చిక్కుల్లో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్...కాబోయే భార్యపై అత్యాచారం చేయబోయాడట!


భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్... దేశంలోని యువ క్రీడాకారులకు రోల్ మోడల్. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే సర్దార్ సింగ్ నిత్యం హాకీతోనే తన జీవితం అన్న చందంగా సాగుతున్నాడు. 2014లో తాను ప్రేమించిన ఇంగ్లండ్ యువతి, ఇంగ్లండ్ అండర్-19 హాజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అష్పల్ భోగాల్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ సందర్భంగా సర్దార్, అష్పల్ ల మధ్య ఏర్పడ్డ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2014లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా నిన్న అష్పల్ తీసుకున్న నిర్ణయం పెను కలకలం రేపింది. తనపై సర్దార్ సింగ్ అత్యాచార యత్నం చేశాడని ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించినా, సర్దార్ పై ఇంకా కేసు నమోదు చేయలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News