: గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని పవన్ కల్యాణ్


టాలీవుడ్ అగ్ర నటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ కేరళలో ముమ్మరంగా జరుగుతోంది. అయితే మొన్న ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షూటింగ్ నిలిపేసుకుని ఆ రోజు రాత్రికే ఆయన హైదరాబాదు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాదులో మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత సోమవారం రాత్రే ఆయన తిరిగి షూటింగ్ కోసం కేరళ వెళ్లిపోయారు. ఈ క్రమంలో నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. జూబ్లీహిల్స్ పరిధిలో పవన్ కల్యాణ్ కు ఓటు హక్కు ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఆయన తన ఓటు హక్కు వినియోగంపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News