: టీఆర్ఎస్ అండతోనే అసదుద్దీన్, అక్బరుద్దీన్ రెచ్చిపోయారు: ఎర్రబెల్లి
టీఆర్ఎస్ పార్టీ అండతోనే ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చిపోయారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, అసదుద్దీన్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడులు చేయడం అమానుషమని అన్నారు. దీనిపై దృష్టి మరల్చేందుకే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడిపై కూడా దాడి జరిగినట్టు నాటకం మొదలుపెట్టారని ఆయన మండిపడ్డారు. పోలింగ్ బూతుల్లోకి దూసుకెళ్లి దాడులకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. కేవలం అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అండతో ఎంఐఎం దాడులకు తెగబడిందని ఆయన చెప్పారు.