: ఎన్నికలు ప్రశాంతం ...విజయం టీఆర్ఎస్ దే!: కేటీఆర్
ఏడు సంస్థల ఎగ్సిట్ పోల్స్ లో టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేస్తుందని పేర్కొనడం సంతోషం కలిగిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలింగ్ చివర్లో ఎంఐఎం-కాంగ్రెస్, ఎంఐఎం-టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడం విశేషం. జరిగిన సంఘటనలన్నీ పోలింగ్ కేంద్రాల బయట చోటు చేసుకోవడంతో రీపోలింగ్ జరిగే అవకాశం లేదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిష్పాక్షికంగా పని చేసిందని ఆయన చెప్పారు. 5న అంతా కలిసి సంతోషం పంచుకుందామని ఆయన తెలిపారు. ఎన్నికలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలని ఆయన చెప్పారు.