: ప్రార్థనకు రాలేదని తల నరికేశారు...ఐఎస్ఐఎస్ పాశవిక చర్య!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఐఎస్ఐఎస్ పనులపై జుగుప్సతో దానిని వదిలి వెళ్లాలని భావించిన 20 మంది ఉగ్రవాదులను అత్యంత క్రూరంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తాజగా మరోదారుణం వెలుగు చూసింది. సిరియాలోని జురాబ్లస్ నగరంలో ఓ యువకుడు గత శుక్రవారం ప్రార్థనలకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన ఉగ్రవాదులు ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రుల ఎదుటే అత్యంత పాశవికంగా తలనరికి హత్యచేశారు. ఇకపై ఎవరైనా ప్రార్థనలకు రాకపోతే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News