: కాపురంలో చిచ్చు పెట్టిన ఫేస్ బుక్ ప్రేమ
ఫేస్ బుక్ ప్రేమలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతంలోని ఓ భార్యాభర్తల దాంపత్యం సజావుగా సాగుతోంది. అయితే, వీరికి ఫేస్ బుక్ లో వేర్వేరు పేర్లతో ఫేక్ ఐడీలు ఉన్నాయి. ఈ ఐడీలతో వారిద్దరూ కొంత కాలంపాటు ఒకరికి తెలియకుండా మరొకరు ఛాటింగ్ చేసుకున్నారు. అనంతరం వారి అనుబంధం ముదరడంతో ప్రేమగా మారింది. దీంతో మరింత ఎక్కువ సమయం ఫేస్ బుక్ లో గడిపారు. ఇలా ఆరు నెలలు గడిచాక ఒకరోజు కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. తీరా కలుసుకున్నాక ఇద్దరూ అవాక్కయ్యారు. ఎందుకంటే వారిద్దరూ అప్పటికే దంపతులు! దీంతో గతంలో ఛాటింగ్ సందర్భంగా మనసులు విప్పి మాట్లాడుకోవడంతో ఇక కలిసి ఉండడం అసాధ్యమని అర్థం చేసుకుని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.