: ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా అరెస్టు


ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే బలాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదలోని అజంపురలోని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసంపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తన కుమారుడు అజం అలీ గాయపడ్డాడని డిప్యూటీ సీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బలాలను అరెస్టు చేశారు. కాగా, టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడులకు పాల్పడ్డారని ఎంఐఎం ఆరోపిస్తుండగా, ఎంఐఎం పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగారని ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News