: మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం కార్యకర్తల దాడి
తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి దిగారు. హైదరాబాదులోని అజంపురలో ఉన్న తన ఇంటిపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాల అనుచరులు దాడికి పాల్పడ్డారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, డిప్యూటీ సీఎం నివాసంపై దాడికి దిగిన వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడులకు పాల్పడ్డారని ఎంఐఎం కార్యకర్తలు పేర్కొంటున్నారు.