: మాధవన్ చిత్రంపై మనసు పారేసుకున్న మైక్ టైసన్


ఒకప్పటి బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ బాలీవుడ్ చిత్రంపై మనసు పారేసుకున్నాడు. ఈ సినిమా చూడాలని ఉందని తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించాడు. ఇంతకీ ఆ చిత్రం ఏంటనుకుంటున్నారా? అదే 'సాలా ఖడూస్'. టైసన్ పోస్టుకు స్పందించిన మాధవన్, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే తన సినిమా చూపించే ఏర్పాటు చేస్తానని ట్వీట్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధవన్ కోచ్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే బాలీవుడ్ లో విడుదలై మంచి పేరు సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News