: ముగిసిన గ్రేటర్ హైదరాబాదు పోలింగ్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేటి సాయంత్రం 4 గంటల వరకు కేవలం 42 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మందకొడిగా సాగింది. సెలబ్రిటీలు తరలి వచ్చి ఓటేయగా, సాధారణ ప్రజలు ఓటేయడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి కారణమేంటని ఆరాతీయగా, ఒక పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించిన తరువాత పార్టీలు మారుతున్నారని, అలాంటప్పుడు తమ ఓటుకు విలువ ఏముందన్న భావం పెరుగుతోందని, అందుకే ఓటేసేందుకు ఆసక్తి సన్నగిల్లుతోందని పలువురు ఓటర్లు తెలిపారు. కాగా, నేటి సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఎంత మంది ఉంటే వారందరికీ ఓటింగ్ కు అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. 50 శాతానికి మించి ఓట్లు పోల్ కాకపోవడంపై విస్మయం వ్యక్తమవుతుండగా, ఓ ప్రధాన ఘట్టం ముగిసిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News