: ఉపాధి కూలీలతో కలసి రాహుల్ సహపంక్తి భోజనం
అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. కూలీల మధ్యనే కూర్చుని తనకు వడ్డిస్తున్న కూరల పేర్లను అడిగి తెలుసుకున్నారు. అన్నింటినీ రుచి చూశారు. ఏకంగా రాహుల్ తమ మధ్య కూర్చుని భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని కూలీలు తెలిపారు. అంతకుముందు ముఖాముఖిలో కూలీలతో మాట్లాడిన రాహుల్, పథకం అమలవుతున్న తీరు, ఎంత కూలీ ఇస్తున్నారు, పనులు ఇస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఉపాధి హామీ పథకం లేకుంటే తాము వలసలు వెళ్లాల్సి వచ్చేదని, దాని వల్లే తమకు ఉపాధి లభించిందని తెలిపారు.