: చంద్రబాబుకు జ్ఞానోదయమవ్వాలని ఆశిద్దాం: జగన్
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాట నెరవేర్చుకోలేదని, దీంతో తమ కుటుంబం ఇబ్బందిపడుతోందని శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ యువభేరీ కార్యక్రమంలో ఒక విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ, ‘రుణమాఫీపై మాట నిలబెట్టుకోలేని చంద్రబాబుకు జ్ఞానోదయమవ్వాలని ఆశిస్తున్నాను. ప్రజల సంక్షేమం పట్టని చంద్రబాబు హామీలివ్వడానికే పరిమితమయ్యారు’ అంటూ జగన్ మండిపడ్డారు.