: తుని హింస కచ్చితంగా జగన్ ప్రేరేపిత అసాంఘిక శక్తుల పనే: సీఎం చంద్రబాబు
కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలు, మంత్రులతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో నెం.30కు సంబంధించిన వివరాలను సీఎం వారికి తెలిపారు. జీవో నెం.30 అనేది కేవలం ప్రకటననే అని, కాపులకు రిజర్వేషన్ ఖరారు చేసిన ఉత్తర్వు కాదని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే తుని హింస కచ్చితంగా జగన్ ప్రేరేపిత అసాంఘిక శక్తుల పనేనన్న బాబు, రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరచడమే వారి ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఇక బీసీ సంక్షేమంపై ఇవాళ సాయంత్రం సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.