: రజనీకాంత్ తన్నినా ఆనందమే అంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్!
"నా సినీ జీవితంలో ఎన్నో ఫైట్స్ చేశాను. రోబో సీక్వెల్ లో రజనీకాంత్ తో యుద్ధం చేయబోతున్నాను. రజనీతో ఫైటింగ్, ఆయనతో దెబ్బలు తినడం నాకెంతో ఆనందం" అని సంబరపడి పోతున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. రోబో-2 చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్, ఈ సినిమాలో పోరాట దృశ్యాల కోసం ఎటువంటి శిక్షణా తీసుకోలేదని చెప్పాడు. రజనీకాంత్ ను తొలిసారి కలుసుకున్న సందర్భాన్ని తాను మరచిపోలేదని, రోబోలో ఆయనతో కలిసి నటించే సమయం కోసం వేచిచూస్తున్నానని చెబుతున్నాడు.