: రాజశేఖరరెడ్డి హయాంలో కాపులను బీసీల్లో ఎందుకు చేర్చలేదు?: చంద్రబాబు


‘రాజశేఖరరెడ్డి హయాంలో కాపులను బీసీల్లో ఎందుకు చేర్చలేదు?’ అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 23 ఏళ్లుగా నోరుమెదపని నేతలు, ఇటువంటి అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడుతున్నారని అన్నారు. ముందస్తు వ్యూహంతోనే ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. అవినీతి డబ్బుందని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డపేరు తేవాలని, ఈ రాష్ట్రమంటేనే భయపడిపోవాలనే తప్పుడు ఆలోచనలతో ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారన్నారు. నిరాధార పూరితంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని బాబు హితవు పలికారు.

  • Loading...

More Telugu News