: అంధుల కోసం ప్రత్యేక ఈవీఎంలు!


‘గ్రేటర్’ ఎన్నికల్లో అంధులు ఓటు వేసేందుకు తగ్గ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2న పోలింగ్, 5వ తేదీన కౌంటింగ్ జరగనుందన్నారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా 24 కేంద్రాలు, 3,500 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు చెప్పారు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఐటి ఉద్యోగులను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం కోసం ఐటి ఆఫీసులకు సెలవు ప్రకటింపజేశామన్నారు. పోలింగ్ రోజున విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు మరుసటి రోజున సెలవు ప్రకటించారు.

  • Loading...

More Telugu News