: డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయని సంబరపడిపోవద్దు...తీవ్ర ప్రమాదం పొంచి ఉంది: శాస్త్రవేత్తలు


గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు డ్రైవర్ లెస్ కార్ల రూపకల్పనకు నడుంబిగించాయి. దీంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయంటూ వినియోగదారులు సంబరపడిపోయారు. అయితే ఈ పరిశోధనలు పూర్తిగా కార్యరూపం దాల్చకముందే వీటితో పెను ప్రమాదం పొంచి ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని వారు తెలిపారు. ఈ కార్ల తయారీలో ఉపయోగించే అత్యాధునిక కంప్యూటర్లు, సెన్సర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటివి హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని వారు వెల్లడించారు. హ్యాకింగ్ ద్వారా కారులోని బ్రేకులు, యాక్సిలరేటర్, ఇతర ముఖ్యభాగాలు అదుపులోకి తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News