: నేను ఒక కులానికి చెందిన వాడిని కాదు...నేను సమైక్యవాదిని: పవన్ కల్యాణ్


తాను కేవలం ఒక వర్గాన్నో లేక ఒక కులాన్నో లేక ఒక మాతన్నో కాంక్షించే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను జాతీయతా భావం కలిగిన వ్యక్తినని చెప్పారు. సమైక్యతా భావం కలిగి, దేశాభివృద్ధిని కోరుకునే మనిషినని ఆయన తెలిపారు. జరిగిన ఘటనలో తప్పొప్పులు వెతకడం కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత వహించేలా నాయకులు వ్యవహరించాలని చెప్పడం తన బాధ్యత అని అన్నారు. నిందారోపణ సర్వసాధారణమని, అలాంటివి తనకు ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. కాపులది న్యాయమైన డిమాండ్ అని అంతా అంగీకరిస్తారని ఆయన చెప్పారు. వారి డిమాండ్ ను ఎలా నెరవేర్చాలో ఆలోచించాలని ఆయన సూచించారు. జరిగిన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఉందని చెప్పిన ఆయన, ఉద్యమ నేతలది కూడా అంతే వైఫల్యమని ఆయన సూచించారు. పోరాటాలు శాంతియుతంగా, సమస్యలు పరిష్కరించేలా జరగాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News