: తుని అల్లర్లకు కారణం చంద్రబాబే!: విశాఖలో సి.రామచంద్రయ్య ప్రకటన


తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న చోటుచేసుకున్న అల్లర్లకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే కారణమని ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విశాఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, గద్దెనెక్కిన తర్వాత ఆ విషయాన్ని పక్కనబెట్టేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగానే నిన్నటి కాపు గర్జనలో కాపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని రామచంద్రయ్య చెప్పారు. కాపుల హింసాకాండకు ముమ్మాటికీ చంద్రబాబుదే బాధ్యత అని ఆయన ఆరోపించారు. నిర్ణీత గడువులోగా కాపులను బీసీల్లో చేర్చి ఉంటే, నిన్నటి ఘటన చోటుచేసుకునేదే కాదని కూడా ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News