: దోషులను గుర్తించండి, కేసులు పెట్టండి: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్


కాపు గర్జన తరువాత అల్లర్లకు దిగిన వ్యక్తులను గుర్తించి, వారిపై తక్షణమే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన అరెస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే విషయమై నిన్న వేచిచూసే ధోరణిలో కనిపించిన ఆయన, నేడు తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది కాపు కార్యకర్తలు ఉండటం, వారిలో ఎంతో మంది గర్జనకు వెళ్లినట్టు తెలియడంతో కొంత ఉదాసీనత పాటించాలని చూసిన ఏపీ సర్కారు, నష్టం వెనుక కుట్ర ఉందన్న భావనకు వచ్చిన తరువాత సీరియస్ అయ్యారని తెలుస్తోంది. 2 వేల మంది పోలీసులు ఉండి కూడా అల్లర్లను నిలువరించలేకపోయారని అభిప్రాయపడ్డ ఆయన, సాధ్యమైనంత త్వరగా నిందితులను గుర్తించాలని పోలీసులకు, నిఘా వర్గాలకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి గర్జనకు బయలుదేరిన వారి వివరాలను గుర్తించే పనిలో ఆయా ప్రాంతాల స్థానిక పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News