: జగన్ ఉచ్చులో కాపు నాయకులు పడొద్దు: చినరాజప్ప
కాపు నాయకులు జగన్ ఉచ్చులో పడొద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సూచించారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాపు ఉద్యమం ముసుగులో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కాగా, తుని ఘటనపై పలువురు టీడీపీ నాయకులు జగన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాపు గర్జన నేపథ్యంలో విధ్వంసం సృష్టించాలని కొన్ని శక్తులు కొన్ని రోజుల ముందే రహస్య అజెండా రూపొందించుకున్నాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని కాపులపై ఇప్పుడు కొందరు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.