: ‘రత్నాచల్’ రైలు డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన భారీ ప్రమాదం!
రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. ‘కాపు ఐక్య గర్జన’ ఆందోళనకారులు రైలు ఇంజన్ పై ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయించడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. ఎలమంచిలి సమీపంలో రేగుపాలెం వద్ద హౌరా-చెన్నై మెయిల్, సామర్ల కోట రైల్వేస్టేషన్ లో జన్మభూమి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి.