: చరిత్రహీనుడిగా మిగిలిపోనున్న చంద్రబాబు: కన్నా నిప్పులు
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని మరచిపోయారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై పుట్టు స్వామి కమిషన్ నివేదిక ఉండగానే, దాన్ని పక్కనబెట్టి, మరో కమిటీని వేయడంతో కాపుల్లో ఆందోళన మరింతగా పెరిగిందని ఆయన అన్నారు. నేడు జరగనున్న కాపు గర్జన ప్రభావం మొదట పడేది చంద్రబాబుపైనేనని వెల్లడించిన కన్నా, ఈ సభకు లక్షలాది ప్రజలు ఇప్పటికే బయలుదేరారని తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను మోహరిస్తోందన్న సమాచారం ఉందని, ఇది విచారకరమని అన్నారు.