: ఘోర విషాదాన్ని చూసి మరోసారి ప్రపంచం కన్నీరు పెట్టింది!


అయిలాన్ కుర్దీ... తండ్రితో కలసి టర్కీకి వలస వస్తూ, పడవ మునిగి చనిపోయిన చిన్నారి బాలుడు. సముద్రపు అలలు జోకొడుతుంటే, ఇసుకనే పట్టుపరుపుగా చేసుకుని హాయిగా నిద్రిస్తున్నట్టున్న కుర్దీ మృతదేహం చిత్రం బయటకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కన్నీరు పెట్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అంతకన్నా ఘోరం. మొత్తం 37 మందితో ప్రయాణిస్తున్న సిరియా శరణార్థుల పడవ టర్కీ తీరానికి సమీపంలో నీటిలో మునిగిపోగా, అందరూ చనిపోయారు. ఈ బృందంలో 10 మంది చిన్నారులుండగా, వారందరి మృతదేహాలూ తీరానికి కొట్టుకొచ్చి, చూపరుల గుండెలను పిండేస్తున్నాయి. ముదురు నీలం రంగు ప్యాంటు, కోటు, నీలి రంగు స్వెట్టర్ ధరించిన ఓ మూడేళ్ల బాలుడి మృతదేహాన్ని టర్కీ రెస్క్యూ అధికారి పైకి లేపిన చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వలసవాదుల దయనీయ స్థితిపై ఎన్నో ప్రశ్నలను లేపుతోంది. ఇక తీరం వెంబడి చిన్నారుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్న చిత్రాలూ బయటకు వచ్చాయి. కాగా, ఈ నెలలో వలస వస్తూ ఏజియన్ సముద్రంలో చనిపోయిన వారి సంఖ్య 218గా అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News