: పాక్ నుంచి ఎగిరొచ్చిన బెలూన్లు, ఎయిర్ ఫోర్స్ అలర్ట్!


పాకిస్థాన్ వైపు నుంచి బెలూన్ ఆకారంలోని ఓ వస్తువు ఇండియావైపు వస్తుండటాన్ని చూసిన భారత వాయుసేన దాన్ని పేల్చేసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన ఇంకోటి జరిగింది. పాక్ నుంచి కొన్ని బెలూన్లు రాజస్థాన్ లోని బామర్ జిల్లా, రామ్ సర్ ప్రాంతంలో ల్యాండయ్యాయి. వీటికి "పాక్ తుర్క్, ఐఎస్ఆర్ఏ క్యాంపస్, ఆన్యువల్ స్పోర్ట్స్ డే" అని రాసున్న బ్యానర్ కూడా ఉంది. ఈ బెలూన్లను సీజ్ చేశామని, విచారిస్తున్నామని బామర్ ఎస్పీ అనిల్ పారిస్ దేశ్ ముఖ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ విభాగాన్ని అలర్ట్ చేశామని, పాక్ నుంచి ఎగిరొస్తున్న వస్తువులు ఎలాంటివైనా వాటిని గాల్లోనే పేల్చాలన్న ఆదేశాలున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News