: చంద్రబాబు కంటే భువనేశ్వరి ఒదినమ్మే మంచిది!: కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హైదరాబాదును వదిలి వెళ్లనని చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 'వదల బొమ్మాళీ వదలా' అని చంద్రబాబు అంటున్నారు. హైదరాబాదును వదిలి పొమ్మని అసలు ఎవడు చెప్పాడు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాదులో ఉంటానంటే వద్దని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కంటే ఆయన భార్య భువనేశ్వరి ఒదినమ్మ చాలా మంచిదని కేసీఆర్ అన్నారు. ఆవిడ వ్యాపారాలేవో ఆవిడ చేసుకుంటూ ఇంటిపట్టున ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు. హెరిటేజ్ షాపులు పది పెట్టుకుంటానంటే తనను అడగాలని, అందుకు తాను సాయం చేస్తానని చంద్రబాబుకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆవిడ విచక్షణతో ఆలోచించి టీఆర్ఎస్ కే ఓటేస్తాదని కేసీఆర్ అనడంతో అంతా నవ్వేశారు.

  • Loading...

More Telugu News