: ఆ ముగ్గురూ లేకుండా టీమిండియాను నిలువరించేందుకు వాట్సన్ ఏం చేయనున్నాడు?


వర్థమాన క్రికెట్ లో ఛాంపియన్ గా పిలిపించుకున్న ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. భారత్ ను అడ్డుకునే ప్రణాళిక ఆసీస్ వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను న్యూజిలాండ్ పంపడంతో వారు చివరి రెండు టీట్వంటీలకు దూరమయ్యారు. అనంతరం టీట్వంటీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెండో టీట్వంటీ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో చివరి మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో చివరి మ్యాచ్ కు షేన్ వాట్సన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మంచి ఫాంలో ఉన్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టుకు దూరం కావడం భారంగా మారగా, వారి కంటే మంచి ఫాంలో ఉన్న ఆరోన్ ఫించ్ గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోవడం ఆసీస్ కు తీవ్రలోటుగా మారింది. ఈ నేపథ్యంలో ఆసీస్ చివరి టీట్వంటీలో వర్ధమాన ఆటగాళ్లతో నెట్టుకురానుంది. అయితే వరుస పరాజయాలతో డీలాపడ్డ ఆస్ట్రేలియా జట్టు పుంజుకోవాలంటే విజయం సాధించాల్సిన అవసరం ఉందని వాట్సన్ చెబుతున్నాడు. పరిమిత వనరులతో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాను నిలువరించగలుగుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

  • Loading...

More Telugu News