: రాహుల్ కు మద్దతుగా దీక్ష చేయబోయిన టి.కాంగ్రెస్ నేతలు... అరెస్టు చేసిన పోలీసులు


హెచ్ సీయూలో విద్యార్థుల దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా దీక్ష చేయాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో హెచ్ సీయూ బయట టెంట్ వేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఇందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలు వర్సిటీ లోపలికి వెళ్లడంతో బయటకు వెళ్లిపోవాలని రాహుల్ టీమ్ సూచించింది. చేసేది లేక వర్సిటీ గేటు ముందు నేతలంతా బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు టి.కాంగీయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News