: రోహిత్ తరపున న్యాయం కోసం పోరాడేందుకే హైదరాబాద్ వచ్చా: రాహుల్ గాంధీ
హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న వెంటనే హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేడు అతని జన్మదినోత్సవం నేపథ్యంలో మరోసారి నగరానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాంతో ఆయన రాకపై పలువురు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీక్షలో పాల్గొన్న వర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ, రోహిత్ తరపున న్యాయం కోసం పోరాడేందుకే వచ్చానని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం వరకు రాహుల్ దీక్షలో పాల్గొంటారు.