: బాలీవుడ్ లో విడిపోతున్న మరో జంట?


బాలీవుడ్ లో సినీ దంపతుల కటీఫ్ ల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్న హృతిక్ రోషన్, సుజాన్నె ఖాన్ విడిపోగా; నిన్న ఫర్హాన్ అఖ్తర్, అధునా దంపతులు విడిపోయారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ దంపతులు విడిపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. గత వారం కుమారుడ్ని తీసుకుని బాంద్రాలోని ఇంటి నుంచి వెళ్లిపోయిన మలైకా అరోరా తన సోదరి అమృతా అరోరా అత్తమామలు నివసించే ఖర్ ప్రాంతానికి మారినట్టు కథనాలు పేర్కొన్నాయి. బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్తతో మలైకా డేటింగ్ చేస్తోందని, అందువల్ల ఏర్పడ్డ విభేదాల వల్లే వారు విడిపోయారని బాలీవుడ్ అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News