: తమ్ముడూ..లోకేశ్, తెలంగాణలో పోటీ చేస్తావా?: కేటీఆర్
‘తమ్ముడూ..లోకేశ్, తెలంగాణ నుంచి పోటీ చేస్తావా?’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నాడు.. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను’ అని ఇటీవల లోకేశ్ ప్రశ్నపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు. ‘మా తమ్ముడు.. లోకేశ్.. ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తాడా? లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తాడా? ఆ విషయం ముందు చెప్పమనండి’ అని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు తీరుపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు వర్తమానంలో బతుకుతారు, భవిష్యత్ కోసం చూస్తారని, చంద్రబాబును గతంలో బతికితే బతకనివ్వండి.. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొలది బాబు ఎన్ని మాటలు మాట్లాడతారో కూడా చెప్పలేము. ఇంటర్నెట్, కంప్యూటర్, చార్మినార్, గోల్కొండ... ఇట్లా ప్రతిఒక్కటీ తానే కనిపెట్టానని చంద్రబాబు చెబుతాడంటూ కేటీఆర్ విమర్శించారు.